బెంగళూరుకు తరలుతున్న మనవారి పెట్టుబడులు
రాష్ట్ర విభజన ఉద్యమం నేపథ్యంలో.. రాష్ట్రానికి చెందిన సంపన్న ఇన్వెస్టర్లు, విదేశాలలో స్థిరపడిన తెలుగు ఎన్ఆర్ఐల పెట్టుబడులు పక్కనున్న బెంగళూరుకు భారీగా తరలిపోతున్నాయి. బెంగళూరు నగరం దక్షిణాదిన ఐటి రాజధానిగా వెలుగొందుతున్న సంగతి తెలిసిందే. 2009 నుంచీ తెలంగాణ ఉద్యమం ఉధృత రూపం దాల్చడంతో హైదరాబాద్ రియల్టీ మార్కెట్ చప్పబడింది. దీంతో రాష్ట్రానికి చెందిన సంపన్న ఇన్వెస్టర్లు, ఎన్ఆర్ఐలు తమ పెట్టుబడులను బెంగళూరు రియల్టీ మార్కెట్లో పెడుతున్నారు.
గత 24 - 30 నెలల కాలంలో ఆంధ్రప్రదేశ్ ఉన్నత తరగతి ఇన్వెస్టర్లు, తెలుగు ఎన్ఆర్ఐల నుంచి 10 కోట్ల డాలర్లు (రూ.600కోట్లు) నుంచి 20 కోట్ల డాలర్లు (రూ.1200కోట్లు) బెంగళూరు రియల్టీ మార్కెట్లోకి వచ్చినట్లు ఇంటర్నేషనల్ ప్రాపర్టీ కన్సల్టెంట్లు, బ్రోకర్ల గణాంకాలు వెల్లడిస్తున్నాయి. రాష్ట్ర విభజనపై స్పష్టత వచ్చే వరకూ తాత్కాలికంగా ఈ పెట్టుబడులు అటు మరలినట్లు రియల్టీ వ్యాపారులు చెబుతున్నారు.